- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభకార్యానికి వెళ్తుండగా విషాదం.. ఇద్దరు మృతి
మండల పరిధిలోని దేవాయిపల్లి గ్రామ సరిహద్దులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, తాడ్వాయి : మండల పరిధిలోని దేవాయిపల్లి గ్రామ సరిహద్దుల్లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామానికి చెందిన సుమారు 12మంది ప్రయాణికులు ఆటోలో ముత్యంపేటలో జరుగుతున్న శుభకార్యానికి బయలుదేరారు. దేవాయిపల్లి గ్రామ శివారులోకి రాగానే, ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆటో కింద చిక్కుకున్న క్షతగాత్రులను అతికష్టం మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి ఆటో కింద నలిగి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడడంతో డప్పు సాయిలు (57), కామారెడ్డి అస్పత్రిలో ,డప్పు పోషవ్వ(70) నిజామాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై నరేష్ పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






