అన్ని ఘట్టాలు అధిగమించారు.. అనుకున్నది సాధించారు

by Batti.Sumithra |

ఖాకీ చొక్కా, తలపై టోపీ, చేతిలో లాఠీ.. ఇదీ పోలీసు చిహ్నం. సమాజసేవలో.. బాధితులకు అండగా, నేరస్తులకు సింహ స్వప్నంగా గుర్తింపు లభించాలంటే అది ఒక్క పోలీసు ద్వారానే సాధ్యం.

అన్ని ఘట్టాలు అధిగమించారు.. అనుకున్నది సాధించారు
X

దిశ, తాడ్వాయి : ఖాకీ చొక్కా, తలపై టోపీ, చేతిలో లాఠీ.. ఇదీ పోలీసు చిహ్నం. సమాజసేవలో.. బాధితులకు అండగా, నేరస్తులకు సింహ స్వప్నంగా గుర్తింపు లభించాలంటే అది ఒక్క పోలీసు ద్వారానే సాధ్యం. అలాంటి ఉద్యోగం దక్కించుకునేందుకు ఎంతో మంది రాత్రింబవళ్లూ కష్టపడుతూనే ఉంటారు. ఖాకీ చొక్కా ధరించడమనేది చాలామందికి ప్యాషన్‌.. ఇందుకోసమేనేమో ఇటీవల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆరుగురు అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలు వరించాయి. అందులో మెట్టు ప్రేమ్ చంద్ (ఏఆర్ కానిస్టేబుల్ )గా మెట్టు చరణ్ (సివిల్ కానిస్టేబుల్)గా, వడ్ల రవితేజ (టీఏస్ఏస్పి కానిస్టేబుల్) గా, బోగి సాయి (టీఏస్ఏస్పి కానిస్టేబుల్ )గా, దాసరి అరవింద్ (టీఏస్ఏస్పీ కానిస్టేబుల్ )గా, బాయికాడి రాము (సివిల్ కానిస్టేబుల్)గా ఎంపిక అయ్యారు. విరందరివీ వ్యవసాయ కుటుంబాలే. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న పట్టుదల తల్లి తండ్రులు పడుతున్న కష్టం, తీర్చాలన్న కోరికతో ఉద్యోగ సాధనకు సన్నధమై చదువుకుంటూ సిద్దమైయ్యారు. పట్టుదలతో చదివి చదివి లక్ష్యాన్ని అందుకున్నారు.

ఆర్మీ సెలక్షన్లకు ఈ గ్రామం నుంచి యువత వెళితే కొలువు గ్యారంటీ అనే నానుడి కొనసాగుతోంది. అలాంటిది సెంట్రల్ ఉద్యోగలే కాకుండా తెలంగాణ పోలీస్ ఉద్యగాలను ఒక్కసారిగా ఆరుగురు అభ్యర్థులు సాధించడంతో ఆ అభ్యర్థులను గ్రామ సర్పంచ్ సంజీవులు, వైస్ ఎంపీపీ నర్సింలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు, గ్రామయువత వారిని అభినందించారు. గ్రామం నుంచి పోలీసు శాఖలో కొలువు తీరిన వారిని యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఉద్యోగాలను సాధించాలని కోరారు. నీతి, నిజాయితీగా పనిచేస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామం నుంచి ఆరుగురు అభ్యర్థులు పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావటం ఎంతో గర్వంగా ఉందని, వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని ఉద్యోగలు సాధించి జీవితంలో స్థిరపడి సమాజ సేవలో ముందుండే విధంగా గ్రామయువతలో స్ఫూర్తిని నింపాలని కోరారు.

Next Story