- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యం.. మరో ఎస్సైపై సస్పెన్షన్ వేటు
జిల్లాలో ఎస్పీగా రాజేష్ చంద్ర నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్ఐల సస్పెన్షన్ ల పరంపర కొనసాగుతూనే ఉంది.

X
దిశ, కామారెడ్డి : జిల్లాలో ఎస్పీగా రాజేష్ చంద్ర నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్ఐల సస్పెన్షన్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. జుక్కల్, తాడువాయి ఎస్ఐలు ఇదివరకే సస్పెన్షన్కు గురికాగా రామారెడ్డి ఎస్సై కూడా ఆ జాబితాలో చేరారు. గత ఏడాది ఒక వ్యక్తి అదృశ్యమైన కేసులో విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను రామారెడ్డి ఎస్సై నరేశ్ ను ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు అనేకసార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎస్సై నరేశ్ వారి గోడును పట్టించుకోకుండా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడమే కాకుండా కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందనీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Next Story






