కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు జారీ

by Nallavelli.Anjaneyulu |

జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు జారీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో తక్షణమే ఆమె స్పందించారు. స్పెషల్ ఆఫీసర్ ను సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సమగ్ర నివేదిక అందించాలని జిల్లా విద్యా శాఖ అధికారి ని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంట‌నే తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ తరహా సంఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.

Next Story