- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో షార్ట్ సర్క్యూట్
బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో గురువారం షార్ట్ సర్క్యూట్ జరగడంతో పాఠశాల గదిలో పొగ వ్యాపించింది. దీంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో గురువారం షార్ట్ సర్క్యూట్ జరగడంతో పాఠశాల గదిలో పొగ వ్యాపించింది. దీంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇటీవలే కొన్ని కోట్లు వెచ్చించి ప్రభుత్వం పాఠశాలలు నిర్మిస్తే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. నాసిక రకం పనులు చేయడం వల్ల ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదానికి కారణం కాంట్రాక్టరా.. లేక ఉపాధ్యాయుల పర్యావేక్షణ లోపమా కొత్త బిల్డింగ్ నిర్మించి 2, 3 సంవత్సరాలు కూడా కాలేదు ఇలా జరగడం వల్ల విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అదే పాఠశాల విద్యార్థులు అక్కడ ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ హుటా హుటిన పాఠశాలకు చేరుకొని షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది అన్న విషయంమై పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది నీ అడిగి తెలుసుకున్నారు.






