డీసీసీ అధ్యక్షుడి మార్పుపై షబ్బీర్ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావును తిరిగి నియమించాలని నియోజకవర్గం మొత్తం కోరిందని, కైలాస్

డీసీసీ అధ్యక్షుడి మార్పుపై షబ్బీర్ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ, కామారెడ్డి : కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావును తిరిగి నియమించాలని నియోజకవర్గం మొత్తం కోరిందని, కైలాస్ శ్రీనివాసరావును మార్చాలని నిర్ణయిస్తే ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం కల్పించిన తర్వాతే ఆయనను మారుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుని ఎన్నిక కోసం కామారెడ్డి లోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమమని, ఇది పార్టీని పటిష్టం చేయడానికి, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికేనని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా యువత, మహిళలు, అనగారిన వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

అట్టడుగు స్థాయి కార్యకర్తలను సంప్రదించాకే కొత్త అధ్యక్షుడి నియామకం..

జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీ, వార్డులు సందర్శించి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే కొత్త అధ్యక్షులను నియమిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్ పాల్ కరోలా స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల అభిప్రాయాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షునిగా కైలాస్ శ్రీనివాస్ రావును తిరిగి ఎన్నిక చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా రాజ్ పాల్ కరోల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకుని పోతుందన్నారు. యువకులు, విద్యావంతులు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అధ్యక్షుని ఎన్నికలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. తమ పర్యటన తర్వాత నియామకాలను ఖరారు చేయడానికి రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. ఎవరైనా అధ్యక్ష పదవి కావాలనుకునేవారు తమకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అందరూ పాతవారినే కోరుకుంటే తిరిగి ఆయననే ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story