- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు
by Ratna Kumari |
బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయుర్వేద ఫార్మాసిస్ట్ భగవత్ మౌనిక.. వైద్యాధికారి లింగాల నాగ గిరీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

X
దిశ, బాన్సువాడ : ఈ మధ్య కాలంలో రోజు రోజుకు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్కింటి వాళ్లు, బంధువులు, ఉద్యోగం చేసే దగ్గర తోటి ఉద్యోగులు ఇలా ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురికాక తప్పడం లేదు. తాజాగా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయుర్వేద ఫార్మాసిస్ట్ భగవత్ మౌనిక వైద్యాధికారి లింగాల నాగ గిరీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని వైద్యాధికారి నాగ గిరీష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఇన్ చార్జి డిప్యూటీ డీఎంహెచ్ఓ రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వైద్య సిబ్బందితో ఈ కేసు విషయంలో విచారణ చేపట్టారు.
Next Story






