- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : ధర్పల్లిలో కలకలం రేపుతున్న యువతులపై లైంగిక దాడి.. నిందితుల అరెస్ట్
నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ధర్పల్లి మండలం దుబ్బాక అటవీ(Dubbaka Forest) ప్రాంతంలో నలుగురు యువకులు ఇద్దరు యువతులపై లైంగిక దాడి(Sexual Assault)కి పాల్పడినట్లు తెలిసింది.

దిశ, ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ధర్పల్లి మండలం దుబ్బాక అటవీ(Dubbaka Forest) ప్రాంతంలో నలుగురు యువకులు ఇద్దరు యువతులపై లైంగిక దాడి(Sexual Assault)కి పాల్పడినట్లు తెలిసింది. దాడిలో ఒక మహిళ ఎలాగోలా తప్పించుకోగా, మరొక యువతిపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కామాంధుల నుండి తప్పించుకున్న ఆ మహిళ భయపడుతూ రోడ్డుపై భయం భయంగా తిరుగుతుండగా ఇది గమనించిన స్థానిక రైతు ఒకరు చొరవ తీసుకుని ఆమెతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పి గ్రామంలోకి తీసుకెళ్లి ఏం జరిగిందంటూ అడిగాడు. ఆయనకు విషయం అంతా వివరించి చెప్పడంతో దుబ్బాక గ్రామస్థులు విషయాన్ని గమనించి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కారు నడుపుతున్న యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో విషయం బయట పడినట్లు తెలిసింది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్పల్లి మండలంలోని కులాస్ పూర్ లో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొని అటువైపు నుంచి గ్రామానికి చెందిన ముగ్గురు యువతులను ధర్పల్లి మండలంలోని ధనంబండ తండాకి కారులో వస్తున్న యువకులు వారిద్దరిని కారులో ఎక్కించుకుని దుబ్బాక్ గ్రామం, ధనంబండ తండాల మధ్యలో ఉన్న నల్లగుట్ట సమీపంలోని అటవీప్రాంతంలోకి రోడ్డు గుండా లోపలికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరికి కల్లు తాగిస్తుండగా యువకుల ఆలోచనలో తేడాను గమనించిన ఓ యువతి వారి నుంచి తప్పించుకుని దుబ్బాక రోడ్డులో భయంతో పరుగెడుతుండగా గ్రామానికి చెందిన రైతు ఆమెను గమనించారు. రైతు ఆమెతో మాట్లాడి గ్రామంలోకి తీసుకెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించడంతో గ్రామంలోని యువకులు కొందరు మోటర్ సైకిళ్లపై అటవీ ప్రాంతానికి వెళ్లి వెతుకుతుండగా ఇద్దరు దుండగులు మోటర్ సైకిళ్లపై పారిపోయారు. వారిని గ్రామస్థులు గుర్తించి వెంబడించినా దొరకకుండా పారిపోయారు.
అదే రోడ్డులో వెళుతుండగా రోడ్డుపై ఓ కారు ఆగి ఉంది. కారులోని యువకున్ని గ్రామస్థులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో యువతిని వెతుకుతుండగా పొదల్లో వివస్త్రగా అపస్మారక స్థితిలోపడి ఉన్న యువతిని గ్రామస్థులు గమనించి ఆమె ఒంటిపై వస్త్రం కప్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో బాధిత యువతిని పోలీసులకు అప్పగించగా చికిత్స నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. నలుగురు యువకులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు యువతి తెలిపినట్లు సమాచారం. నిందితులు ధనంబండ తాండాకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది బాధిత యువతులిద్దరు 25 ఏళ్లలోపు వారేనని గ్రామస్థులు చెపుతున్నారు. ఘటనపై యువతులను పోలీసులు విచారిస్తున్నారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్ ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి ఘటన జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. లైంగిక దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.






