- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు, లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు, లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరీ కొంత మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ శివారులో మంగళవారం జరిగిన బస్సు, లారీ ఢీకొని 31 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలకు గురయ్యారు. బోధన్ డిపో నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దానికి ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఉండటంతో ఎదెరెదురుగా రెండు ఢీ కొన్నాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్ చీరాల సాదయ్య, లారీ డ్రైవర్ తీవ్రంగా గాయల పాలయ్యారు. అతివేగంగా అజాగ్రత్తగా బస్సు లారీ ని ఢీ కొనడంతో బస్సులో ముందు వరుసలో ఉన్న 31 మంది లో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలిలించారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు బోధన్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఎక్స్ ప్రెస్ బస్సు రుద్రూర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఉదయం సమయంలోనే బస్సు డ్రైవర్ మద్యం సేవించి విధులకు హాజరు కావడం పట్ల సంబంధిత ఆర్టీసీ మేనేజర్ కానీ, అధికారులు గాని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేస్తుందని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆర్టీసీ డిపో మేనేజర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయం సమయంలోనే ఆర్టీసీ డ్రైవర్ సాదయ్య మద్యం తాగినట్లు అధికారులు ధృవీకరించారు. మద్యం తాగి బస్సు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రతి డిపోలో ప్రతి డ్రైవర్ కు, కండక్టర్ కి మద్యం సేవించారా..? లేదా అని పరీక్షలు జరిపి వారికి బస్సులు అప్పగించవలసి ఉండగా, అధికారులు ఆ వైపు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఉదయమే ఆర్టీసీ డ్రైవర్ మద్యం తాగినట్లు అధికారుల రిపోర్ట్ లో తేలింది. ఆర్టీసీ డిపో మేనేజర్ తీరుపట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు. మద్యం తాగి బస్సులు నడపకుండా డ్రైవర్లకు, కండక్టర్లకు పరీక్షలు జరపాల్సి ఉండగా ఆ వైపు అడుగులు వేయకపోవడం వల్ల ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ఈ విషయంపై ఆసుపత్రిలో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆర్టీసీ డిపో మేనేజర్ పై తీవ్రంగా మండి పడుతున్నారు. మద్యం తాగిన వ్యక్తులకు బస్సులు ఎలా అప్పగిస్తారని ప్రయాణికులు డిపో మేనేజర్ ను నిలదీశారు. పెద్ద ఎత్తున క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, ఆస్పత్రికి చేరుకోవడంతో భారీగా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలు మోహరించాయి.






