- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో సెల్ఫీ సూసైడ్ కలకలం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. నగరానికి చెందిన క్రాంతి అనే యువకుడు, ఎస్సై వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పురుగుల మందు సేవించాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై బాబూరావు 7లక్షల నగదు, 3.5 తులాల బంగారం తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు.
భార్య భర్తల మధ్య విబేధాలు సృష్టించి తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో కొట్టించి, భార్య పిల్లలకు, తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. నగరంలోని 2వ పోలీస్ స్టేషన్లో తనపై అకారణంగా కేసులు బనాయించి, ఇబ్బందులపాలు చేస్తున్నాడని వాపోయాడు. పురుగుల మందు సేవించిన క్రాంతిని స్థానికులు గుర్తించి హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.






