ఇస్రో సందర్శనకు చిన్న మల్లారెడ్డి విద్యార్థినుల ఎంపిక

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థినిలు నిఖిల, రవిత్రేణిలు ఇస్రో

ఇస్రో సందర్శనకు చిన్న మల్లారెడ్డి విద్యార్థినుల ఎంపిక
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థినిలు నిఖిల, రవిత్రేణిలు ఇస్రో సందర్శనకుఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఈ అవకాశాన్ని దక్కించుకోవడం అభినందనీయమన్నారు. గైడ్ టీచర్ ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) సందర్శనకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థినులు ఇస్రో సందర్శనలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా గమనించి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ప్రేరణ పొందుతారని తెలిపారు.

Next Story