- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద బాధితులకు అండగా ప్రభుత్వం
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి హౌజింగ్ బోర్డు,

దిశ, కామారెడ్డి : వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి హౌజింగ్ బోర్డు, జిఆర్ కాలనీల్లో పర్యటించారు. హౌజింగ్ బోర్డు వద్ద వరద ధాటికి దెబ్బతిన్న బ్రిడ్జిని స్వయంగా పరిశీలించారు. అనంతరం జిఆర్ కాలనీలో ముంపుకు గురైన ఇండ్లలో బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనిలోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా పండ్లు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ఇంతటి విపత్తు జరగడం బాధాకరమన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అర్ధరాత్రి మొదలైన వర్షం తెల్లారేసరికి బీభత్సం సృష్టించడం ఊహించని పరిణామమని తెలిపారు. వరద ధాటికి ఒక డాక్టర్, మరొక ఇద్దరు చనిపోయినట్టుగా తెలిసిందన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చెప్పారన్నారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేపడుతుందన్నారు.
ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోవడం సంతోషకరమైన విషయమని, ఆస్తినష్టం బాగానే ఉన్నట్టుగా తెలుస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. అధికారులతో సమీక్ష చేపట్టి సహాయక చర్యలను ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ఆస్తినష్టం వివరాలను అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.






