- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ ముట్టడికి సిద్దమైన సర్పంచ్ లు
అర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్ అతని భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన తెలిసిందే.

దిశ, నిజామాబాద్ : అర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్ అతని భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన తెలిసిందే. బాధితుల పక్షాన సర్పంచ్ కామారెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో పోలీసులు ప్రవర్తించిన తీరు పై తీవ్ర అసహనానికి గురై రాజంపేట మండలానికి చెందిన సర్పంచ్ లు అందరూ కలిసి సర్పంచ్ పై పోలీసులు దాడి చేయడంతో అవమానికి గురైన తోటి సర్పంచ్ లు సంబంధిత పోలీస్ స్టేషన్ ను ముట్టించేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి సంబంధిత సీఐతో పాటు కానిస్టేబుళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని సర్పంచ్ లతో పాటు బాధిత కుటుంబీకులు కామరెడ్డి పట్టణానికి చేరుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు బాధిత సర్పంచ్ తో పాటు సర్పంచులు, బాధితులను తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. దీంతో ఒక్కరోజుకు ఆందోళన విరమిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో బాధిత పోలీసులను వదిలే ప్రసక్తే లేదని సర్పంచులు మొండికేశారు. బాధిత పోలీసులపై జిల్లా ఎస్పీతోపాటు డీజీపీని కూడా నేరుగా కలిసి వినతి పత్రాలు అందజేసి వారిపై చర్యలకు డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలందరితో పోలీసులు పెండ్లిగా వ్యవహరించాల్సి ఉండగా.. వాటన్నిటి పక్కన పెట్టి ఓ ప్రజా ప్రతినిధి పైనే దాడి చేయడంతో మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.






