- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న సదాశివనగర్ పోలీసులు..
by Kodari Anjali |
సదాశివనగర్ పోలీసులు 60 మహిళ ఆచూకీ కనుగొని మానవత్వం చాటుకున్నారు.

X
దిశ, సదాశివనగర్: సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో మతిస్థిమితం లేని సుమారు 60 ఏళ్ల మహిళ అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు డయల్-100కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర్ పోలీసులు స్పందించి ధర్మారావుపేటకు చేరుకుని మహిళ ఆచూకీ కనుగొన్నారు. విచారణలో ఆమె సదాశివనగర్ గ్రామానికి చెందిన కుర్ర సావిత్రిగా గుర్తించారు. మహిళ ముఖంపై గాయాలు ఉండటంతో ఆ సమయంలో నైట్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఇసాక్, రంజిత్ రెడ్డి వెంటనే ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె బంధువులను గుర్తించి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి, మానవతా దృక్పథంతో బాధిత మహిళకు వైద్య సహాయం అందించి కుటుంబ సభ్యులకు అప్పగించిన సదాశివనగర్ పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.
Next Story






