- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్సై
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏన్కూరు ఎస్సై నారబోయిన సంధ్య అన్నారు.

దిశ, ఏన్కూరు: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏన్కూరు ఎస్సై నారబోయిన సంధ్య అన్నారు. మండల కేంద్రమైన ఏన్కూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహ న సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారబోయిన సంధ్య మాట్లాడుతూ.. గంజాయి.. డ్రగ్స్.. ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. విద్యార్థి దిశ అనేది జీవితానికి ఎంతో కీలకమైందని.. ఈ సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడితే.. బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సమాజంలో జరుగుతున్న మంచి చెడులను గమనిస్తూ మెలకువలతో ముందుకు వెళ్లాలని ఆమె అన్నా రు. నేటి యువతరం చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె కో రారు.
రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలను..
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. చదువుతూనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. ఒక ప్పుడు మహానగరంలో వినిపించేటటువంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్.. గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటయ్యే యువత నేడు చాప కింద నీరు లాగా డ్రగ్స్.. గంజాయి లాంటి పదార్థాలు నేడు పల్లెల్లోకి చేరుకున్నాయని ఆమె అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆమె అన్నారు. చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుందని ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల ని.. రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటితరం విద్యార్థులే అని ఆమె అన్నారు.
మంచి మార్కులతో పాసై ఉన్నత విద్యను...
విద్యార్థులు దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని, నిషేధిత డ్రగ్స్.. మత్తు పదార్థాలు వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఆమె సూచించారు. పాఠశాల పరిసరాలలో గానీ..గ్రామాలలో గానీ ఎవరైనా అనువాద అనుమానాస్పదం గా కనిపిస్తే లేదా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె విద్యార్థులను కోరారు. మాదకద్రవ్యాలకు బానిసలై శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపాలని ఆమె కోరారు. మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అందుకోసం విద్యార్థులు తరగతిలోనే మంచి మార్కులతో పాసై ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రాఘవరావు, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, కస్తూరి, శ్రీధర్, నరసింహారావు, శంకర్ రావు, చంద్ర ప్రకాష్, వర్జినియా, శ్రీరామ్, హత్తి రామ్, భీమ్ సింగ్, సులోచన, వీరయ్య, పుల్ల య్య, రాంబాబు, ఇక్బాల్, రవికిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






