- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారి పై ఎదురుగా వెళ్తున్న లారీని మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారి పై ఎదురుగా వెళ్తున్న లారీని మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. TS17 T6060 నెంబర్ గల కామారెడ్డి డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు నిజామాబాద్ నుంచి కామారెడ్డి వస్తోంది. అయితే బస్సు వెనకాల ఉన్న లారీ రెండుసార్లు బస్సును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలో బస్సును తాకుతూ లారీ వెళ్ళింది. వేగంతో వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న అదే లారీని ఓవర్ టేక్ చేస్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ వైపు బస్సు ముందుబాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 26 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.






