దేశ సంరక్షణ, యుగ ధర్మం కొరకే ఆర్ఎస్ఎస్.

by Ratna Kumari |

దిశ, నవీపేట్ : దేశ సంరక్షణ, యుగ ధర్మం కొరకు మాత్రమే కాకుండా సమాజ పరివర్తన, వ్యక్తి నిర్మాణం కొరకు ఆర్ఎస్ఎస్ పని చేస్తుందని.. భారతదేశం, హిందూ ధర్మం

దేశ సంరక్షణ, యుగ ధర్మం  కొరకే ఆర్ఎస్ఎస్.
X

దిశ, నవీపేట్ : దేశ సంరక్షణ, యుగ ధర్మం కొరకు మాత్రమే కాకుండా సమాజ పరివర్తన, వ్యక్తి నిర్మాణం కొరకు ఆర్ఎస్ఎస్ పని చేస్తుందని.. భారతదేశం, హిందూ ధర్మం ప్రపంచ శాంతి కొరకు ప్రపంచ మనుగడ కొరకు ఉన్నదని ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం నవీపేట్ శాఖ ఆధ్వర్యంలో దసరా ఉత్సవ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రభుజీ మాట్లాడుతూ దేశభక్తి సమాజ నిర్మాణం, హిందూ సంఘటన కొరకు డాక్టర్ హెగ్డేవార్ 1925 సంవత్సరం లో ఆర్ఎస్ఎస్ ను నాగపూర్ లో ప్రారంభించారని తెలిపారు. గత 100 సంవత్సరాలుగా ఎన్నో రంగాలలో మార్పు కొరకు స్వయం సేవకులు పని చేస్తున్నారని, శత జయంతి సందర్భంగా సంఘం ను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలని సూచించారు.

హిందూ ధర్మం లో పండుగలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని, మార్గదర్శనం చేస్తాయని తెలిపారు. పండుగలు అంటే కొత్త బట్టలు పిండివంటలు మాత్రమే కాదని పండగలకు చారిత్రాత్మక ఆధ్యాత్మికత పౌరాణికత కలిగి ఉన్నాయని, పండగ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని పండుగలు జరుపుకోవాలని తెలిపారు. విజయదశమి పండగ విజయాలను చేకూర్చే అత్యంత శ్రేష్టమైన పండుగ అని, చెడు పైన మంచి విజయం, అధర్మం పైన ధర్మం విజయం సాధించిన రోజే దసరా అని ఆర్ఎస్ఎస్ సైతం ఇదే రోజున ప్రారంభించబడినది తెలిపారు. మంచి వారి సంఘటన మంచివారు శక్తివలెనని సమాజంలో విజయం కలుగుతుందని అన్నారు.

శక్తి సహితం శివం శివం శక్తి రహితం శవం శవం అని, హిందూ సమాజం శక్తి రహితంగా మారడంతోనే భారతదేశం 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో మునిగిపోయిందని ఈ కలియుగంలో శక్తి నిర్మాణం అవసరం అని అన్నారు. దేశ ప్రజలు మన చరిత్రను మన శక్తిని మన ఇతిహాసాలను మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి నిర్మాణం, సమాజ పరివర్తన, వ్యక్తి నిర్మాణం కొరకు పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను దేశంలో మూడుసార్లు నిషేధించారని అయినా వీటన్నింటి తట్టుకొని కడిగిన ముత్యం మాదిరి సంఘం ఆ సూర్యచంద్రార్కం వరకు నిలిచి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మఠంకర్ సుధాకర్ రావు, ఆర్ఎస్ఎస్ భాద్యులు, అధిక సంఖ్యలో స్వయం సేవకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Next Story