బాన్సువాడ‌లో ఆర్ఎస్ఎస్ శ‌త జ‌యంతి వేడుక‌లు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఆర్.ఎస్.ఎస్. శతజయంతి వేడుకలను ఆర్ఎస్ఎస్ శ్రేణులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పట్టణంలోని

బాన్సువాడ‌లో ఆర్ఎస్ఎస్ శ‌త జ‌యంతి వేడుక‌లు
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఆర్.ఎస్.ఎస్. శతజయంతి వేడుకలను ఆర్ఎస్ఎస్ శ్రేణులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పత సంచలన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దారి వెంట ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ప్రజలు పూలతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా నాగుల గామ వెంకన్న, వక్తగా అయచితుల లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 100 సంవత్సరాల క్రితం డాక్టర్ హెగ్డేవార్ ఈ సంస్థను ప్రారంభించారని, ఆర్ఎస్ఎస్ ఉద్దేశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, ప్రసాద్, గూడుగుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story