- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీ షీటర్ రియాజ్ ని ఎన్ కౌంటర్ చేయాలి :ఆనంది యూత్ అసోసియేషన్
దిశ, నందిపేట్ : నేర చరిత్ర ఉన్న రియాజ్ ని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని

దిశ, నందిపేట్ : నేర చరిత్ర ఉన్న రియాజ్ ని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని జోర్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోర్పూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు రాము మాట్లాడారు. పోలీస్ కానిస్టేబుల్ అని చూడకుండా కత్తితో దాడి చేయడం నేర ప్రవృత్తిని తెలియజేస్తుందన్నారు. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారని.. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత గంజాయి మత్తులో ఏం చేస్తుందో అర్థం కావడం లేదని.. మత్తులోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. నిందితుడు రియాజ్ ని ఎన్ కౌంటర్ చేశారని కొందరూ.. చేయలేదని మరికొందరూ అంటున్నారు. ఒకవేళ రియాజ్ ని ఎన్ కౌంటర్ చేయకుంటే వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.






