- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. పిచ్చి మాటలు మానుకో'
పిచ్చి మాటలు మానుకో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

దిశ, కామారెడ్డి : పిచ్చి మాటలు మానుకో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. గురువారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంకే ముజీబోద్దీన్ లు మాట్లాడారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రజా ప్రభుత్వం పేరుతో అరాచకాలు సృష్టిస్తూ సమాజాన్ని విడదీసేలా, చిచ్చుపెట్టే విధంగా సీఎం స్థాయి వ్యక్తి మాటలు ఉన్నాయన్నారు. ఈ నెల 18 న ఖమ్మంలో టీడీపీని కేసీఆర్ లేకుండా చేసాడని, రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలని మాట్లాడటం చూస్తే సీఎం ఎంత అసహనంతో ఉన్నాడో అర్థం అవుతుందన్నారు. బీఆర్ఎస్ పై మాట్లాడే అర్హత సీఎంకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప పోరాట యోధుడు, రాష్ట్ర మొదటి సీఎం కేసీఆర్ మీద రెండేళ్లుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి ఖబడ్దార్..
ప్రజలకు ప్రజాపాలన ప్రభుత్వమని చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. ఇకనైనా ఈ మాటలు మానుకో అని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై చిన్నచిన్న విషయాలపై కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను సీఎం అని, ఏది చెప్తే అది నడుస్తుందని, ప్రతిపక్షం ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దని సీఎం అనుకుంటున్నాడన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఏ పార్టీలో ఉన్నావో ఆలోచించుకోవాలని సూచించారు. నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కూల్చారని గుర్తు చేశారు. ఇవాళ టీడీపీ గురించి ఏం మాట్లాడుతున్నావని నిలదీశారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి టీడీపీ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుండి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దినది కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్రలో నిలిచే వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని మాటలు అంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలకు సుపరిపాలన కోసం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, రెండేళ్లలో జిల్లాకు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసారా అని ప్రశ్నించారు. లెక్కలేని ప్రోటోకాల్ పేరుతో సిసి రోడ్లు, డ్రైనేజీలు గుర్తొచ్చాయా షబ్బీర్ అలీ అని నిలదీశారు. కామారెడ్డి అభివృద్ధి ఇవాళ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. నాటి సీఎం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తే నిదులు ఇవ్వకుండా నిర్లక్యం చేస్తున్నారని, 330 పడకల ఆస్పత్రి వస్తుందని, రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందుతుందని కేసీఆర్ ఆలోచించారన్నారు. సీఎం తన భాష మార్చుకోవాలని సూచించారు. వెంటనే సీఎంపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని, డీజీపీ, ఎస్పీలను కోరుతున్నామన్నారు.
గల్లీ రౌడీలా..?
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు గల్లీ రౌడీలా ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును దుర్భాశలాడుతున్నారన్నారు. తొమ్మిదిన్నరేళ్లు దేశంలో ప్రజలు మెచ్చుకునేలా కేసీఆర్ పాలన సాగిందన్నారు. రాష్ట్ర పరువు తీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ముందుకు సాగేలా పాలన ఉండాలని, ఇలాంటి మాటలు పునరావృతం అయితే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి టీడీపీకి మచ్చ తెచ్చారని, తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టేలా చేసింది రేవంత్ రెడ్డేనని అన్నారు. సీఎం మాటలను ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారని, ఆయన హోదాను దిగజార్చేలా మాటలు ఉన్నాయన్నారు. ఆరు గ్యారెంటీలు మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిట్టడానికే రెండేళ్లు గడిచిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పోతున్నారన్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎంకు విలువలు లేవా.. మీ స్థాయి ఇదేనా.. అని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఏనాడైనా టిఆర్ఎస్ వస్తుందని ఊహించారా.. తెలంగాణ వస్తుందని పసిగట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ ను తొలగించలేరన్నారు. టీడీపీని బొందపెట్టి కాంగ్రెస్ లోకి వచ్చారని, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ కు ఓటేయకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిట్ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని, ఏడాదికి 20 వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గద్దెలను ముట్టి చూడాలని, సీఎం ఎక్కడ తిరుగుతాడో చూస్తామన్నారు. ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎంకు సూచించారు. స్వాతంత్రం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే బ్రిటిష్ పాలన బాగుండే అనేవాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.






