దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన మినీ శ్రీకాంత్‌

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : దిశ క‌థ‌నానికి విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌లే ఈ రోడ్డు ప్ర‌మాదక‌రం.. గుంత‌ల మ‌యంగా ఆర్మూర్‌–ఆలూర్‌–నందిపేట్‌ రోడ్డు అనే శీర్షికతో సోమవారం దిశ పత్రికలో

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన మినీ శ్రీకాంత్‌
X

దిశ, ఆలూర్ : దిశ క‌థ‌నానికి విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌లే ఈ రోడ్డు ప్ర‌మాదక‌రం.. గుంత‌ల మ‌యంగా ఆర్మూర్‌–ఆలూర్‌–నందిపేట్‌ రోడ్డు అనే శీర్షికతో సోమవారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రజల విపరీతమైన స్పందన లభిస్తోంది. నడిరోడ్డుపై ఏర్పడిన ప్రమాదకరమైన గొయ్యిలు, గుంతలు వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారాయనే క‌థ‌నం పై దేగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మినీ శ్రీకాంత్‌ స్పందించారు. ప్రజల సమస్యను గమనించిన మినీ శ్రీకాంత్‌ సొంత ఖర్చుతో రహదారి మరమ్మత్తులు చేపట్టారు. గుంతలను ఇసుక, రాళ్లతో నింపి వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ఆటో డ్రైవర్లు, యువకులు మినీ శ్రీకాంత్ కు, దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.

Next Story