- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఆర్పీల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి
తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ల సమస్యలను పరిష్కరించాలని సీఆర్పీలు మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.

దిశ, నిజాంసాగర్ : తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ల సమస్యలను పరిష్కరించాలని సీఆర్పీలు మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని తెలంగాణ సచివాలయంలో మంగళవారం తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న. తమకు న్యాయం జరగడం లేదని చాలీచాలని వేతనాలతో జీవితాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఆర్పీ లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ విషయాన్ని మానవత దృక్పథంతో వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వీరి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిసిఆర్పిఏ అధ్యక్షులు తిరందాస్ సంతోష్ కుమార్ , కార్యదర్శి కొత్త కాపు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్య సలహాదారులు బి.శ్రీధర్ కుమార్, కె.భాస్కర్, డి. శరత్ కుమార్, యువరాజు పాల్గొన్నారు.






