మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని త‌హ‌శీల్దార్ కి వినతి

by Ratna Kumari |

దిశ, ఏర్గట్ల : మొక్కజొన్న పంట దిగుబడి పూర్తై నిల్వ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని త‌హ‌శీల్దార్ కి వినతి
X

దిశ, ఏర్గట్ల : మొక్కజొన్న పంట దిగుబడి పూర్తై నిల్వ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంగళవారం మండలానికి చెందిన రైతులు తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న తడిసిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గోదాములు లేకపోవడం వల్ల పంటను నిల్వ చేయలేక దళారుల చేతికి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని వెల్ల‌డించారు. వర్షాలు, దళారుల కారణంగా పంట ధర సగానికి సగం నష్టానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు ఊరట కలుగుతుందన్నారు. ఈ విషయమై తహసీల్దార్ మల్లయ్య సమస్యను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు.

Next Story