పేదల సొంతింటి కల సాకారం : మాచారెడ్డి మాజీ ఎంపీపీ

by Nallavelli.Anjaneyulu |

పేద‌ల సొంతింటి క‌ల సాకారం అయింద‌ని.. ఉగాది ప‌ర్వ‌దినాన గృహ ప్ర‌వేశం పూర్తి అయింద‌ని మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయ‌ప‌ల్లి న‌ర్సింగ‌రావు పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల సాకారం :  మాచారెడ్డి మాజీ ఎంపీపీ
X

దిశ, మాచారెడ్డి : పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ‌సాకారం చేస్తుందని మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు అన్నారు. మండలం లోని గజ్యానాయక్ తండా గ్రామంలో నిర్వహించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను ప్రారంభించారు. సుద‌న‌మైన ల‌క్ష్మీ, క‌ర్రెపు న‌ర్స‌వ్వ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఉగాది పండుగ సంద‌ర్భంగా గృహ‌ప్రవేశం చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ హాజ‌రై మాట్లాడారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ వారి కళ్లలో ఆనందం చూడాలనే ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం ‌సాకారం చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొంది ఇళ్ల‌ నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. ఐకేపీ సంఘాల ద్వారా రుణాలు పొంది ఇంటి నిర్మాణ దశల్లో వచ్చే ఆర్థిక సహాయం తో రుణాలు తీర్చుకునే వెసులు బాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేవలం ఇందిరమ్మ ఇళ్ల‌ నిర్మాణాలకే ఇసుక పర్మిషన్ ఇ‌స్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్, ఉప సర్పంచ్ భిక్షపతి, పార్టీ ప్రెసిడెంట్ బన్సీ నాయక్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త అరవింద్, మాచారెడ్డి సర్పంచ్ సంతోష్, భవానిపేట మాజీ సర్పంచ్ మద్దెల రాజు, గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story