ప్రజా సమస్యలు తీర్చిన వారే అసలైన నాయకులు : ఎమ్మెల్యే మదన్ మోహన్

by Ratna Kumari |

రోడ్ల మీద పడి ధర్నాలు చేసినంత మాత్రాన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ నాయకులు కాలేరు.. ప్రజల కష్టాలను తీర్చి, వారి కన్నీళ్లు తుడిచిన వాడే నిజమైన నాయకుడు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

ప్రజా సమస్యలు తీర్చిన వారే అసలైన నాయకులు : ఎమ్మెల్యే మదన్ మోహన్
X

దిశ,​ తాడ్వాయి : రోడ్ల మీద పడి ధర్నాలు చేసినంత మాత్రాన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ నాయకులు కాలేరు.. ప్రజల కష్టాలను తీర్చి, వారి కన్నీళ్లు తుడిచిన వాడే నిజమైన నాయకుడు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గురువారం మండల కేంద్రంలో రెండో విడత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి పక్షాలకు చురకలు

ప్రతిపక్ష నాయకులు కేవలం ప్రచారం కోసమే పాకులాడుతున్నారని,ప్రజల సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.ధర్నాలు చేయడం కాదు..పనులు చేసి చూపించే సత్తా ఉండాలి.ఆ సత్తా మా ప్రభుత్వానికి ఉంది కాబట్టే,రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు గడువు ముగిసినా, ప్రత్యేక చొరవతో తాడ్వాయిలో రెండో విడత కేంద్రాన్ని తెరిపించాంఅని స్పష్టం చేశారు.కేవలం మాటలు చెప్పేవారికి,చేతల్లో చూపే వారికి ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

రైతులకు భారీ ఊరట

సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల, మార్క్ఫెడ్ ఎండీ అధికారుల సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, దీనివల్ల రైతులకు క్వింటాలుకు రూ. 600 అదనంగా లభిస్తుందని తెలిపారు. తాడ్వాయి రైతులకు దాదాపు రూ. 30 కోట్ల భారీ లబ్ధి చేకూరుతుంటే ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.మొదటి విడుత కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులు మున్సిపల్ ఎన్నికలతో కాస్త ఆలస్యం అయ్యిందని,ఆ డబ్బులు సైతం వారం రోజుల లోపే రైతుల అకౌంట్ లో డబ్బులు పడతాయని ఆయన హామీ ఇచ్చారు.

అసెంబ్లీలో గళం.. మదన్ మోహన్ అంటే చరిత్ర

మదన్ మోహన్ అంటేనే ఒక చరిత్ర అని ఆయన గర్వంగా ప్రకటించారు. గత పాలకులు ఎన్నడూ ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో పట్టించుకోలేదని, తాను మాత్రం నియోజకవర్గ గళాన్ని 30 నిమిషాల పాటు అసెంబ్లీలో వినిపించానని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని,పనికిరాని విమర్శలు చేసేవారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి,ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, గ్రామ సర్పంచ్ మెట్టు విజయ,ఉపసర్పంచ్ రనీల్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్యనాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి,అధికార ప్రతినిధి మహమ్మద్ షౌకత్,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివాజీ,కాంగ్రెస్ నాయకులు,విడిసి అధ్యక్షుడు మేకల రాజు,వెంకట్రాంరెడ్డి,జంగం రాజు, సీడీసీ మాజీ చైర్మన్ మద్ది మహేందర్ రెడ్డి,యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు,టౌన్ యూత్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story