మద్యం మత్తులో జోగుతున్న పల్లెలు.. యథేచ్ఛగా బెల్ట్ షాప్ దందా..!

by Bhanu |   (  Updated:2025-05-23 15:20:20  IST  )

రాజంపేట మండలం లోని పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మండలంలోని బస్సన్నపల్లి,ఆర్గోండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్దాపూర్ మొదలగు గ్రామాలలో, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలిసినాయి, అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.

మద్యం మత్తులో జోగుతున్న పల్లెలు.. యథేచ్ఛగా బెల్ట్ షాప్ దందా..!
X

దిశ, రాజంపేట : రాజంపేట మండలం లోని పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మండలంలోని బస్సన్నపల్లి,ఆర్గోండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్దాపూర్ మొదలగు గ్రామాలలో, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలిసినాయి, అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పల్లెలు మత్తులో జోగుతున్నాయి, ఈ బెల్ట్ షాపులు అనధికారిక మద్యం కేంద్రాలుగా మారాయి.మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. మండలంలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతూ, ప్రజలను మద్యానికి బానిసను చేస్తున్నాయి. యువత పెడదారి పట్టడానికి దారితీస్తుంది.మరోవైపు మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ బెల్ట్‌షాపుల నిర్వహణకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేలం వేస్తున్నారు.

పేరుకే కిరాణా దుకాణం...

మండలంలోని కొన్ని గ్రామాల్లో పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. గ్రామాల్లో పొద్దున పగలు రాత్రి అని తేడా లేకుండా బెల్ట్ షాప్ లో వద్ద పండుగ వాతావరణంలా కనపడుతూ, వైన్ షాప్ మాదిరిగా దొరకని మందు లేదంట్టు, ఇంకా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ 24 గంటల పాటు బెల్టు షాపుల వద్ద మద్యం దొరుకుతుంది. దీంతో మద్యం ప్రియులకు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా రైతులు రోజంతా కూరగాయలు పండించి చేసిన కష్టం కూరగాయల ద్వారా వచ్చిన డబ్బు మద్యానికి పెడుతూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మధ్య తరగతి కుటుంబాలు చెందిన వ్యక్తులు అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిన పాలవుతున్నాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, మెడికల్, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం కనిపిస్తాయి.మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో, మెడికల్లో, రేకుల షెడ్లు వేసుకుని బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా మద్యం ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ యువత పూర్తిగా మద్యం మత్తులో బానిసలై బంగారు భవిష్యత్తుని కోల్పోతున్నారని యువతే నేటి ప్రపంచానికి పునాది అనే పదానికి పూర్తిగా విరుద్ధంగా యువత మద్యం మత్తులో ఊగుతున్నారని, అలాగే తాగుడుకు బానిస యువత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని స్థానికంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు, గృహింస, మానభంగాలు, కొట్లాట,ఆత్మహత్యలు పెరగడానికి మద్యపానం కారణమవుతుంది.

బహిరంగ వేలం ద్వారా బెల్టు షాపులు నిర్వహిస్తూ.. అధిక ధర వసూలు

గ్రామాల్లో బహిరంగ వేలం ద్వారా బెల్ట్‌ షాపు లు నిర్వహిస్తున్నారు. బెల్ట్‌ షాపులు నిర్వహించడం చట్టవిరుద్ధమైనా.. ప్రజాప్రతినిధుల అండతో కొన్ని గ్రామాల్లో ఏకంగా బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు. కొందరైతే ఏకంగా బెల్ట్ షాప్ నిర్వాహకులు వేలంధార బెల్ట్ షాప్ దక్కించుకొని గ్రామపంచాయతీల్లో వాయిదా పద్ధతి లో డబ్బులు కట్టి గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధి పాలవుతున్నాయి. మండలంలోని గ్రామాల్లో విచ్చలవిడి బెల్ట్ షాపుల కారణంతో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు క్వార్టర్ పై రూ.30, హాఫ్ పై రూ. 60 ఫుల్ పై రూ. 120 బీర్ పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్స్ షాపుల్లో ఉండే ప్రతి ఒక బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం. ప్రతి ఒక్క గ్రామంలో వీధి వీధికి, కొన్ని గ్రామాల్లో అయితే రోడ్డుకు ఇరువైపుల రేకుల షెడ్డు నిర్మాణం చేసుకుని బెల్ట్ షాపులు పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంబంధిత ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు దృష్టి పెట్టకపోవడంతో పరోక్షంగా బెల్ట్ షాపుల నిర్వాహకులను పెంచి పోషించినట్లుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు బెల్ట్ షాపులపై అడపాదడపా దాడులు చేస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు.


Next Story