- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేదలకు అండగా ఉంటా.. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురం రాజమౌళి
by Batti.Sumithra |
నిరుపేదల కోసం తనవంతు సహాయం చేస్తానని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురం రాజమౌళి అన్నారు.

X
దిశ, భిక్కనూరు : నిరుపేదల కోసం తనవంతు సహాయం చేస్తానని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురం రాజమౌళి అన్నారు. మంగళవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పేదలకు, రోగులకు దుప్పట్లతో పాటు, పండ్లు, పాలు, బ్రెడ్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా పేదలకు సహాయం అందించడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు.
నిరుపేదలకు తనవంతు చేతనైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. దక్షిణ కాశీ సిద్ధ రామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం, ఆలయ అర్చకులు కొడకండ్ల సిద్ధరామ శర్మ, న్యాలకంటి రాజేశ్వర శర్మలు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట పలువురు పట్టణ ప్రజలు ఉన్నారు.
Next Story






