అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

by Ratna Kumari |

కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరుపై బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు.

అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరుపై బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... కనీసం కౌన్సిలర్ గా గెలవలేని నాయకులు సైతం ఎమ్మెల్యే ను విమర్శించడం శోచనీయమన్నారు. అవినీతి చరిత్ర కలిగిన వారు అవినీతి మచ్చ లేని మా నాయకుడిపై ఆరోపణ చేయటం సిగ్గు చేటన్నారు. కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శాసన సభ్యునిగా ఎన్నికైన తర్వాత అనేక అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. షబ్బీర్ అలీ కొబ్బరి కాయ కొట్టడం తప్ప ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం అని, మా ఎమ్మెల్యే రమణ రెడ్డిని తీసుకురావడానికి మేం సిద్ధమని, మీ షబ్బీర్ అలీని తీసుకురావడానికి మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్థలం, సమయం మీరే చెప్పండి. షబ్బీర్ అలీ పై మా నాయకుడు రమణన్న చేసిన ఆరోపణలు నిరూపించడానికి మేం సిద్ధం అని అన్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడు మా రమణన్న అని, డబ్బుల కోసమే రాజకీయం చేసే నాయకుడు షబ్బీర్ అలీ అని హితవు పలికారు. 2028 లో రమణన్న పై పోటీ చేసి గెలిచే సత్తా షబ్బీర్ అలీ కి ఉందా అని ప్రశ్నించారు.

Next Story