అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం

by Nagam Mallesh |

అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం
X

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన బండారి నవనీత (24)కు పురిటి నొప్పులు రావడంతో సాయం కోసం 108 అంబులెన్సుకి కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది నవనీతను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి అంబులెన్సులో తీసుకెళ్తున్నారు. నొప్పులు ఎక్కువగా రావడంతో మార్గమధ్యలో వాహనాన్ని పక్కన ఆపి ఈఎంటి ప్రభాకర్ ప్రసవం చేశారు. మూడో కాన్పులో నవనీత మగబిడ్డకి జన్మనిచ్చింది. అనంతరం ఏరియా ఆసుపత్రికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబీకులు ఈఎంటి ప్రభాకర్, పైలెట్ ప్రశాంత్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story