- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారదర్శక పాలన కోసమే ప్రజాపాలన : అదనపు కలెక్టర్ విక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అన్నారు.

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వానాకాలంలో పండిన 4,57,101 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1092 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1,98,159 మంది రైతులు రైతు భీమాకు అర్హత కలిగి ఉన్నారని, గత సంవత్సరం చనిపోయిన 554 మంది రైతుల కుటుంబాలకు రూ.27.70 కోట్లు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2,07,423 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.100.41 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 4,23,247 క్వింటాళ్ల మొక్కజొన్నను 21 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.32.98 కోట్లు రైతుల ఖాతాలో జమచేసామన్నారు. 9 కొనుగోలు కేంద్రాల ద్వారా 61,870 క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేసి రూ.15.23 కోట్ల రూపాయలు, 13,062 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించి సిసిఐకి విక్రయించడం జరిగిందని, ఇప్పటివరకు రూ.104 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.
రూ.16.05 కోట్ల సబ్సిడీ
జిల్లాలో 2,93,241 రేషన్ కార్డుల ద్వారా నెలకు 6,322 మెట్రిక్ టన్నుల బియ్య. పంపిణీ జరుగుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,51,342 మంది లబ్ధిదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని, దీనికోసం ప్రభుత్వం రూ.16.05 కోట్ల సబ్సిడీ అందించిందన్నారు. చేయూత పథకం ద్వారా జిల్లాలో 1,59,771 మంది లబ్ధిదారులకు రూ.38 కోట్ల 36 లక్షల 75 వేల రూపాయలు వివిధ రకాల పింఛన్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా 9199 మహిళా సంఘాలకు రూ.727.30 కోట్లు, స్త్రీనిధి-సహకార బ్యాంకు ద్వారా 8129 మంది సభ్యులకు రూ.80.14 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 6.42 కోట్ల మంది ప్రయాణించారని, తద్వారా మహిళలకు రూ.203.98 కోట్ల లబ్ది చేకూరిందని తెలిపారు. బీసీ, ఎస్సి, ఎస్టీ వసతి గృహాలు నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.24.97 కోట్లు ఖర్చు చేస్తుందని, జిల్లాలో 11,142 మంది విద్యార్థులకు రూ.7.57 కోట్ల రూపాయల ఉపకార వేతనం అందిస్తున్నట్టు పేర్కొన్నారు.6 గృహజ్యోతి పథకం ద్వారా 1,70,328 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 12072 ఇండ్లు మంజూరు కాగా 9401 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, 2419 ఇండ్లు బేస్మిట్ లెవల్, 977 ఇండ్లు గోడల వరకు, 2746 ఇండ్లు స్లాబ్ లెవల్ వరకు పనులు జరగగా 106 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.131.32 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.
నిరుపేదలకు శస్త్రచికిత్సలు
జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 18355 మంది నిరుపేదలకు శస్త్రచికిత్సలు, చికిత్స గురించి రూ.49 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పోచారం రిజర్వాయర్, లింగంపేట నాగన్నబావిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజురు చేసిందని, నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం అభివృద్ధి కోసం రూ.9.97 కోట్లు మంజూరు చేసిందన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ రూ 20 వేలు పరిహారం అందిస్తుందని, జిల్లాలో అర్హులైన 524 కుటుంబాలకు రూ.ఒక కోటి 4 లక్షల 80 వేల రూపాయల మంజూరు కొరకు సెర్ఫ్ సీఈవోకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.ఇప్పటివరకు 462 మంది లబ్ధిదారులకు రూ.92.40 లక్షల రూపాయలు ఖాతాలో జమచేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతా కార్యక్రమాలు పోలీసు శాఖ చేపడుతుందన్నారు. కిడ్స్ విత్ ఖాకి అనే వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ పాఠశాలల నుంచి 160 మంది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నేర రహిత జిల్లాగా మార్చడానికియూ6 పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ .సిసి విద్యార్థులు ఇటీవల జరిగిన వరదల నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది చర్యలను ప్రదర్శించారు. అలాగే బిబిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్యాస్, పెట్రోల్ ఆయిల్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీఓ వీణ ఇతర అధికారులు పాల్గొన్నారు.






