- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడికే డీసీసీ అధ్యక్షుడి పదవీ : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
దిశ, నిజాంసాగర్ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్

దిశ, నిజాంసాగర్ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రం సమీపంలోని నీటిపారుదల శాఖ గుల్గోస్తు వద్ద అతిథి గృహంలో జుక్కల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసిసి అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోల హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ పాల్ ఖరోల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ డీసీసీ అధ్యక్ష పదవీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం జరుగుతుందని అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు.
ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నిబద్ధత కలిగిన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేసే అధ్యక్షుడికి మనమంతా సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా మనమంతా కలిసి పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన జుక్కల్ నియోజకవర్గానికి చెందిన 8 మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కు డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోల ను కోరారు. దీంతో రాజ్ పాల్ ఖరోలా స్పందిస్తూ ఈ విషయాన్ని ఏఐసీసీ అధిష్టానానికి నివేదిస్తామని, ఏఐసిసి అధిష్టానం నిర్ణయం మేరకే డిసిసి అధ్యక్ష పదవి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, దర్పల్ గంగాధర్, రమేష్ దేశాయి, రాజు పటేల్,ధరత్ సాయిలు, మహేందర్ రెడ్డి, హనుమాన్లు, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు బానపురం ప్రతాప్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రోస్,అనిస్ పటేల్, గుర్రపు శ్రీనివాస్,గజ్జల కిరణ్,ప్రజా పండరి,సంకు లక్ష్మయ్య,లోక్యా నాయక్, అబ్దుల్ కాలేక్, గోపి సింగ్, బోయిని హరిన్, అజారుద్దీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






