- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊరంతా బీసీలే... రిజర్వేషన్ మాత్రం ఎస్టీ
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాంగం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో రిజర్వేషన్ కేటాయింపులు జరగడం స్థానిక ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది.

దిశ, మాచారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాంగం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో రిజర్వేషన్ కేటాయింపులు జరగడం స్థానిక ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. అది నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ. తమ గూడేనికి తామే ప్రజాప్రతినిధుల అవుతామని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి ఆశలకు రిజర్వేషన్ల గారడీ గండి కొట్టింది. ఆ ఊర్లో ఉన్నదంతా బీసీలే. కానీ సర్పంచ్ రిజర్వేషన్ మాత్రం ఎస్టీకి కేటాయించారు. ఇదెక్కడి చోద్యం... మా ఊర్లో ఎస్టీలే లేరు కదా! మరి ఇప్పుడు ఎలా..? పరాయి గ్రామం నుంచి ఎస్టీ అభ్యర్థిని అరువు తెచ్చుకోవాలా? ఎస్టీలు లేకుంటే ఎన్నికలు నిర్వహించరా? అంటూ సవాలక్ష ప్రశ్నలతో సతమతమవుతున్నారు.
బీసీ లకు 42శాతం రిజర్వేషన్ అంటే ఇదేనేమో అంటూ కొందరు చమత్కరించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఒడ్డె గూడెం తండా గ్రామపంచాయతీ పరిస్థితి ఇది. గ్రామంలో 331 ఓట్లు ఉన్నాయి. అందులో అందరూ కూడా బీసీలే. కానీ సర్పంచ్ రిజర్వేషన్ మాత్రం ఎస్టీ కి కేటాయించారు. ఒక్క సర్పంచ్ దే కాదు, వార్డు మెంబర్లు సైతం బీసీలకు కేటాయించలేరు. గ్రామంలో ఆరు వార్డులు ఉండగా మూడు జనరల్ కేటగిరికి, మూడు ఎస్టీలకు కేటాయించారు. ఇదెక్కడి చోద్యం అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?
రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనేది చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. జనాభా నిష్పత్తి ప్రకారమా లేక ఓటరు నిష్పత్తి ప్రకారమా అని చాలా గ్రామాల్లో సమీక్ష చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమ సామాజిక వర్గానికి స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎంపీటీసీ రిజర్వేషన్ కు నోచుకోలేదని కొన్ని సామాజిక వర్గాలు వాపోతున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదులు చేశారు.
పేరులో తండా పదం ఉంటే ఎస్టీలకు కిందకి లెక్కా?
గ్రామపంచాయతీ పేరులో ‘తండా’ అనే పదం ఉంటే ఎస్టీల కిందికి వస్తుందా? అనే ప్రశ్న వారిని వెంటాడుతుంది. అందరూ బీసీలే ఉంటే గ్రామపంచాయతీ పేరులో తండా అనే పదం ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఒకటి రెండు ఎస్టీల ఇండ్లను కలుపుతూ గ్రామపంచాయతీ పేరు చివరన తండాను జోడించి పంచాయతీలుగా మార్చారు. కానీ ఇక్కడ జరిగిందేమిటంటే గ్రామపంచాయతీ ఏర్పాటైన తర్వాత ఒడ్డెర గూడెం తండా ఓటర్ జాబితా లో నుంచి ఎస్టీలు ఎల్లంపేట గ్రామపంచాయతీలోకి మార్చుకోవడం జరిగింది. దీంతో ఆ గ్రామపంచాయతీలో ఎస్టీ ఓటర్లు లేకుండా పోయారు. ఇదిలా ఉంటే నడిమి తండా గ్రామపంచాయతీలో బీసీలే లేరు. కానీ అక్కడ ఎంపీటీసీ బీసీకి రిజర్వ్ చేశారు. గ్రామాల్లో స్థానిక సమరం లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిరాశకు గురిచేస్తుందని వాపోతున్నారు.






