మెనూ ప్రకారం భోజనం అందించాలి

by velandi.Saikiran |

మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించాలని, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు పాఠశాల అధ్యాపకులకు

మెనూ ప్రకారం భోజనం అందించాలి
X

దిశ, భిక్కనూరు : మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించాలని, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు పాఠశాల అధ్యాపకులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి లో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతూ, మార్గమధ్యంలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాలను వారు సడన్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

భోజనం సక్రమంగా పెడుతున్నారా.. లేదా అని తెలుసుకోవడంతో పాటు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పాఠశాలలో సెలబస్ ఎక్కడి వరకు పూర్తికావచ్చిందని పాఠశాల స్టాఫ్ ను ప్రశ్నించారు. విద్యార్థిను లు క్రీడల్లో రాణించే విధంగా, శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థినికి వైద్య పరీక్షలు విధిగా చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత, పాఠశాల స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story