పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

by Ratna Kumari |

జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 9 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
X

దిశ, కామారెడ్డి : జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 9 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జూదం, పేకాట వంటి అక్రమ సామాజిక రుగ్మతలను రూపు మాపడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా కొనసాగిస్తోందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 9 మంది పేకాటగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చుక్కాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ. 3,750 నగదు, 4 మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 7,590 నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఈ రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Next Story