- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరం పై పోలీసుల దాడులు
by Ratna Kumari |
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వెంకటాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద గుడిసె లో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది , ఎస్సై రాహుల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేయగా నలుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుంచి 04 మొబైల్ ఫోన్ లు, 02 మోటర్ సైకిల్, ప్లేయింగ్ కార్డ్స్ , నగదు రూ. 8,100 సీజ్ చేసి వారిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు రాహుల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.
Next Story






