కారును త‌గుల‌బెట్టిన నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో పోలీసుల జాప్యం

by Ratna Kumari |

తన ఆస్తి అయిన కారును ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆర్మూర్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన బాధితుడు పస్క నర్సయ్య శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, SC, ST కమిషన్‌ను ఆశ్రయించారు.

కారును త‌గుల‌బెట్టిన నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో పోలీసుల జాప్యం
X

దిశ, ఆర్మూర్ : తన ఆస్తి అయిన కారును ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆర్మూర్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన బాధితుడు పస్క నర్సయ్య శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, SC, ST కమిషన్‌ను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మచ్ఛర్ల గ్రామానికి చెందిన పస్క నర్సయ్య ఆర్మూర్ మాజీ ఎంపీపీ గా గత ఐదు సంవత్సరాలు పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ 13 న అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో, పార్కింగ్ చేసిన కారు (నెం. TS16EW2890) ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి పూర్తిగా తగుల బెట్టారు. ఈ ఘటనపై వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదై ఇన్ని రోజుల వుతున్నా నిందితులను గుర్తించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక దళిత వ్యక్తిగా తన ఆస్తికి రక్షణ కల్పించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో స్థానిక యంత్రాంగం విఫలమైందని బాధితుడు ఆవేదన వ్యక్త పరిచారు. ఈ నేపథ్యంలో, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పోలీసు విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేకూర్చాలని బాధితుడు పస్క నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story