చిత్తు బొత్తు స్థావరంపై పోలీసుల దాడి

by Nallavelli.Anjaneyulu |

బహిరంగ ప్రదేశంలో చిత్తు బొత్తు స్థావరం పై ఎస్ఐ శివకుమార్ దాడి చేశారు. రూ.37,670/నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తు బొత్తు స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మహమ్మద్ నగర్ మండలంలోని గున్కూల్ గ్రామ శివారులోని శుక్రవారం బహిరంగ ప్రదేశంలో చిత్తు బొత్తు స్థావరం పై ఎస్ఐ శివకుమార్ దాడి చేశారు. ఈ దాడుల్లో రూ.37,670/నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని చిత్తు బొత్తు ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మహమ్మద్ నగర్ మండలంలోని గున్కూల్ గ్రామ శివారులోని డబ్బులు పందెంగా పెట్టి చిత్తు బొత్తు ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 5గురు వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.37,670/- నగదు 5మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ...యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు. వీటి ద్వారా ఆర్థికంగా నష్ట పోతారన్నారు. అంతేగాకుండా కేసులు నమోదయితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పేకాట, ఆన్ లైన్ మట్కా, జూదం,పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎస్ఐ శివకుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది వీరభద్ర, రవి, అన్వేష్, ప్రవీణ్ ఉన్నారు.

Next Story