- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికను గర్భవతి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు
దిశ, నాగిరెడ్డిపేట్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికకు 21 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి, భయపెట్టించి గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు ఫోక్సోకేసు నమోదు చేశారు

X
దిశ, నాగిరెడ్డిపేట్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికకు 21 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి, భయపెట్టించి గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు ఫోక్సోకేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నీరుడి పరమేష్ (21) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికను బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి, భయపెట్టించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అయిందన్నారు. ఈ విషయం గత సోమవారం ఆలస్యంగా బాలిక తల్లికి తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నీరుడి పరమేష్ ను అదుపులోకి తీసుకొని అతనిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






