- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి : ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ అన్నారు.

దిశ, భిక్కనూరు : పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ అన్నారు. బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తాలో ని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో స్టాఫ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భూమి మన బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ కోసం చెట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి బి.సబిత, డాక్టర్ టీ ప్రతిజ్ఞ, డాక్టర్ నారాయణ గుప్తా, ఏపీఆర్ఓ డాక్టర్ సరిత పిట్ల, ఉమెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డాక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, డాక్టర్ కనకయ్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






