పోచారం ప్రాజెక్టు చరిత్రలోనే అద్భుతమైన కట్టడం : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రాయ్

by Nallavelli.Anjaneyulu |

దిశ : నాగిరెడ్డిపేట్ : దాదాపు 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు 1లక్ష 82 వేల క్యూసెక్కుల భారీ వరద నీటిని తట్టుకొని చరిత్రలోనే అద్భుతమైన కట్టడంగా నిలిచిందని

పోచారం ప్రాజెక్టు చరిత్రలోనే అద్భుతమైన కట్టడం : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రాయ్
X

దిశ : నాగిరెడ్డిపేట్ : దాదాపు 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు 1లక్ష 82 వేల క్యూసెక్కుల భారీ వరద నీటిని తట్టుకొని చరిత్రలోనే అద్భుతమైన కట్టడంగా నిలిచిందని ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రాయ్ అభివర్ణించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో పర్యటించిన ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం అధికారులు బుధవారం నాగిరెడ్డిపేట మండలంలో పర్యటించారు. ఇందులో బాగంగా మండల కేంద్రానికి సమీపంలో మంజీరా నది పరివాహక ప్రాంతంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపున‌కు గురై నష్టపోయిన పంటలను కేంద్ర బృందం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రాయ్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోచారం ప్రాజెక్టు ను సందర్శించి, గత సెప్టెంబర్ నెలలో ప్రాజెక్టులోకి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు ప్రధాన కట్టకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టులోకి వచ్చిన భారీ వరదలు, ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాల గురించి జిల్లా కలెక్టర్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీకే రాయ్ మాట్లాడుతూ 103 సంవత్సరాల క్రితం పోచారం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, ఇంత భారీ వరదలను తట్టుకొని ప్రాజెక్టు చెక్కుచెదరకుండా నిలబడడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసేందుకు కేంద్రానికి నివేదించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారధి రెడ్డి, స్థానిక తహశీల్దార్ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ ఈఈ మల్లేశ్, డి ఈ వెంకటేశ్వర్లు, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

Next Story