గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య ఉప కేంద్రం సేవలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

by Nallavelli.Anjaneyulu |

దిశ , నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం

గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య ఉప కేంద్రం సేవలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
X

దిశ , నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఎంతో దోహదపడతాయని, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, అన్నా సాగర్ గ్రామాల్లో 20 లక్షల రూపాయల వ్యయం చొప్పున నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలలో కొనసాగిస్తుండడంతో, 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాలను నిర్మించి వైద్య సేవలను అందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో పాత ఐటిఐ కళాశాలను ఆధునిక సాంకేతికతతో మార్చిన అడ్వాన్సుల్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, యువతకు ఆధునిక సాంకేతిక విద్యను అందించేందుకు అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ లో భవిష్యత్తులో మరిన్ని నూతన సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టి ఎల్లారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శరత్, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం అధికారిని పద్మజ, క్వాలిటీ మేనేజర్ జహీరా బేగం, సిహెచ్ ఓ ఠాగూర్, హెచ్ ఈ వోలు గోవింద్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సూపర్వైజర్ రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, నాయకులు కుడుముల సత్యనారాయణ పాల్గొన్నారు.

Next Story