- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు అని, భావితరాల గురించి బాగా ఆలోచించి తనను గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు.

దిశ, నందిపేట్ : ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు అని, భావితరాల గురించి బాగా ఆలోచించి తనను గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయత్రం డొంకేశ్వర్ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేశారు. ఇంటింటికి వెళ్లి బీజేపీని గెలిపించాలని కోరారు. గ్రామంలో ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. డప్పు వాయిద్యాలు,మేళ తాళాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసేవారిని గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చి 5 నెలలు అయ్యిందని, ఎందుకు నెరవేర్చలేదన్నారు. బీజేపీ వస్తే పేదలకు ఇండ్లు, ఆడపిల్ల పుడితే 2 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తాం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురేందర్, కళ్లెం సంతోష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.






