- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షితులై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

దిశ, నిజాంసాగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షితులై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో మోతీ రామగౌడ్, బుడగజంగం నాయకుడు కాశీరామ్‌తో పాటు సింగీతం గ్రామానికి చెందిన పలువురు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నదన్నారు. ప్రజలకు న్యాయం చేసే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి వేగంగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, గుర్రపు శ్రీనివాస్, సర్పంచులు సయ్యద్ రఫీ, గజ్జల జీవన్, కిరణ్, అతిక్, బోయిని హరిన్, గొట్టం నర్సింలు, నాగభూషణం గౌడ్, కోరా మండల్ సాయ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్, సయ్యద్ ఇఫ్తార్ అలీ, గోపి సింగ్, అబ్దుల్ కాలేక్, మహిళా అధ్యక్షురాలు శారద, మల్లయ్య ఆకాష్,ప్రజా పండరి, సంతోష్ రాథోడ్, మేంగారం శ్రీనివాస్ పాల్గొన్నారు.






