ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

by Bhanu |

ఇంటి నిర్మాణానికి సంభందించి ఆన్లైన్ నమోదుకోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
X

దిశ, మాక్లూర్ : ఇంటి నిర్మాణానికి సంభందించి ఆన్లైన్ నమోదుకోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. గొట్టుముక్కల గ్రామ పంచాయతీ లో సెక్రెటరీ గా విధులు నిర్వహిస్తున్న మోహన్ స్థానికంగా ఉండే రాజేందర్ ను 20000 వేలు లంచం డిమాండ్ చేశారు. 18000 లకు ఒప్పందం కుదరగా బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రాయించారు. పక్క ప్రణాళితో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ ఘటన మండల వ్యాప్తంగా పనిచేసున్న ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది.

Next Story