Village schools: నిలువెత్తు నిర్లక్ష్యం..? పిల్లర్లకే పరిమితమైన పల్లె గడ్డ తండా బడి

by Ramesh Naini |

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రం ఆ చదువు కూడా కన్నీటితో కూడిన కష్టంగా మారింది.

Village schools: నిలువెత్తు నిర్లక్ష్యం..? పిల్లర్లకే పరిమితమైన పల్లె గడ్డ తండా బడి
X

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల భవితవ్యం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంధకారంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో పునాది వేసిన పాఠశాల భవన నిర్మాణం, నిధుల కొరతతో నాలుగు సంవత్సరాలుగా కేవలం పిల్లర్ల దశలోనే అసంపూర్తిగా ఆగిపోయింది. దీంతో 43మంది విద్యార్థులు, ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా, తాటిపత్రి కాగితాలు కట్టిన పిల్లర్ల కిందే తరగతి గదులుగా మార్చుకుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 3 ఏళ్ల కింద మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్వయంగా సమస్యను చూసి 2022 లో భవనం మంజూరు చేసినప్పటికీ కూడా పనుల్లో పురోగతి లేకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది. సరైన గది లేకపోవడంతో 43మందిలో 25 మంది విద్యార్థులు మాత్రమే బడికి వస్తున్నారని, వర్షం పడితే ఇంటికి రావాల్సిందేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించాలని తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, తాడ్వాయి: వారసత్వ సంపదను, భావితరాలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందంటారు. కానీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రం ఆ చదువు కూడా కన్నీటితో కూడిన కష్టంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పాఠశాల భవన నిర్మాణానికి పునాది వేసినా నేటికీ ఆ పునాదిపై కేవలం నిలబడిన పిల్లర్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. వర్షం, చలి, ఎండతో సంబంధం లేకుండా ఆ పిల్లర్ల చుట్టూ తాటిపత్రి కాగితాలు కట్టుకొని తరగతి గదులుగా మార్చుకున్నారు. వాటిలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిర్మాణం...

ప్రభుత్వ నిధుల కొరతతో పాఠశాల భవన నిర్మాణం రెండేళ్లుగా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పే ప్రభుత్వాలు, ఈ తండా పిల్లల పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించడం విచారకరం. గతంలో పలుమార్లు దిశ పత్రిక వార్తలు రాసినా అధికారుల్లో చలనం రాలేదు.

మాజీ ఐఏఎస్ చూసినా..

సుమారు 3 సంవత్సరాల కింద మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తండాలో పల్లెనిద్ర చేశారు. ఈ సమస్యను స్వయంగా చూసి 2022 లో భవనం సాంక్షన్ చేయించారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడం క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనతకు నిదర్శనంగా మారింది.

తల్లిదండ్రుల ఆవేదన..

విద్యార్థులు వర్షం, చలి, ఎండతో సంబంధం లేకుండా పిల్లర్ల చుట్టూ తాటిపత్రి కాగితాలు కట్టుకొని తరగతి గదులుగా మార్చుకుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉండగా, సరైన గది లేకపోవడంతో కేవలం 25 మంది మాత్రమే బడికి వస్తున్నారు. గడ్డ కట్టే చలిలో వణికిపోతూ చదువుతున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై దృష్టి సారించి ఆగిపోయిన నిర్మాణ పనులను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన తరగతి గదులను అందించాలని తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story