- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్ర దాడిని ముక్త కంఠంతో ఖండించాలి : షబ్బీర్ అలీ
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాలని ప్రభుత్వ సలహాదారు సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు.

దిశ, కామారెడ్డి : జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాలని ప్రభుత్వ సలహాదారు సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలనీ కోరారు. జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్ లోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని కండిస్తున్నామన్నారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ.. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని, కలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలనీ కోరారు. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారనీ, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదని, చిన్న చీమకు కూడా హాని తలపెట్ట వద్దని ఇస్లాం చెప్తుందన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే మా మద్దతు ఉంటుందన్నారు. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందే అన్నారు.






