రెండు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు

by Sridhar Babu |
రెండు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలో రెండు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి గెజిట్ విడుదలైనట్టు ఎంపీడీవో ప్రభాకర్ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న ఆత్మకూరు, ధర్మారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలోని కన్నారెడ్డి గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నుండి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ప్రస్తుతం మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉండగా

నూతనంగా ఏర్పాటు అయ్యే గ్రామ పంచాయతీలతో 27 గ్రామ పంచాయతీలు అవుతాయన్నారు. చిన్న ఆత్మకూర్, కన్నా రెడ్డి గ్రామాలు ఆమ్లెట్ విలేజ్ గా ఉండగా, ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలను, తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూర్, కన్నా రెడ్డి గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ విడుదల కావడంతో రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed