ఈనెల 23న ఛ‌లో సెంట్ర‌ల్ లేబ‌ర్ క‌మిష‌న‌రేట్ ను జ‌యప్ర‌దం చేయండి

by Nallavelli.Anjaneyulu |

ఈనెల 23న ఛ‌లో సెంట్ర‌ల్ లేబ‌ర్ క‌మిష‌న‌రేట్ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్య‌క్షులు దాసు కార్మికుల‌ను కోరారు.

ఈనెల 23న ఛ‌లో సెంట్ర‌ల్ లేబ‌ర్ క‌మిష‌న‌రేట్ ను జ‌యప్ర‌దం చేయండి
X

దిశ‌, ఆర్మూర్ : ఈనెల 23న ఛ‌లో సెంట్ర‌ల్ లేబ‌ర్ క‌మిష‌న‌రేట్ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్య‌క్షులు దాసు కార్మికుల‌ను కోరారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ లోని మామిడిపల్లి ఏరియాలో గ్రామపంచాయతీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్య‌క్షులు దాసు, జిల్లా ఐఎఫ్టీయూ అధ్య‌క్షులు భూమ‌న్న‌లు ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 01వ తేదీ నుంచి అమ‌లులోకి తీసుకొస్తున్న నాలుగు లేబ‌ర్ కోడ్లు వాప‌స్ తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 10 గంట‌ల ప‌ని వ‌ద్దు.. ఎనిమిది గంట‌ల విధానం ముద్దు అన్నారు. కార్మికుల ర‌క్త త‌ర‌ప‌ణ‌తో 8 గంట‌ల ప‌ని విధానం సాధించుకున్నామ‌ని తెలిపారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని.. దేశంలో 43 కోట్ల మంది కార్మికుల‌కు పీఎఫ్, ఈఎస్ఐ వెంట‌నే వ‌ర్తింప‌జేయాల‌ని డిమాండ్ చేశారు. జాతీయ క‌మిటీ పిలుపు మేర‌కు మార్చి 23న లేబ‌ర్ క‌మిష‌న‌రేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Next Story