జేసీబీ సహాయంతో వరద బాధితులను కాపాడిన అధికారులు

by velandi.Saikiran |

జేసీబీ సహాయంతో వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడారు పోలీస్, అగ్నిమాపక అధికారులు. భారీ వర్షాలతో మండలం మొత్తం

జేసీబీ సహాయంతో వరద బాధితులను కాపాడిన అధికారులు
X

దిశ , గాంధారి : జేసీబీ సహాయంతో వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడారు పోలీస్, అగ్నిమాపక అధికారులు. భారీ వర్షాలతో మండలం మొత్తం అతలాకుతలం అవుతోంది. రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి గాంధారి పెద్ద వాగు ఉదృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు , చెరువులు పొంగి పొర్లి పెద్ద వాగులో వరద ప్రమాదకరంగా మారింది. గాంధారి చెరువు కట్ట కింద గల కాలనీలో వరద నీరు పెరగడంతో తాటి నారాయణ అనే వ్యక్తి కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. దింతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.... జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Next Story