- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పనులతో అధికారులు బిజీ.. నత్తనడకన సాగుతున్న ఎల్‌ఆర్‌ఎస్
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరతకు తోడు తరచూ సర్వర్ మొరాయిస్తుండటంతో దరఖాస్తుల పరిశీలనలో అవాంతరాలు ఎదురవుతోన్నాయి. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో స్లోగా నడుస్తోంది. ఈ ప్రక్రియను కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూశాఖ, ఇరిగేషన్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. మూడు శాఖల అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదని, ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులు తమ సొంత శాఖా పరమైన పనులు బిజీ కారణంగా ఎల్ఆర్ఎస్ పనులపై కొంత ఆలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క వారి సొంత శాఖ పనులు చక్కబెడుతూ మరోపక్క ఈ ఎల్ఆర్ఎస్ పనుల కోసం అదనంగా వర్క్ చేస్తున్నారు. దీంతో కొంత మేర ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆశించినంత వేగంగా కొనసాగడం లేదని తెలుస్తోంది. మున్సిపల్ పరిధిలో 33,684 దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచే కేవలం 55.29 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయి.18,624 అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసి వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అక్రమ లే అవుట్ ప్లాట్లను క్రమబద్దీకరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను కూడా స్వీకరించింది.ఒక్కొక్కరు ఒక్కో ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం రూ. 1000 లు నామమాత్రపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 33,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా రూ. 1000 లు చెల్లించి నిబంధనల ప్రకారం ప్లాట్ ను రెగ్యులరైజ్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వానికి చెల్లించారు. ఇలా నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 33,684 దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుండి కేవలం 55.29 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయి.18,624 అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నట్లు నిజామాబాద్ కార్పొరేషన్ ఏసీపీ టి.శ్రీనివాస్ తెలిపారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుందన్నారు.
మూడు దశల్లో దరఖాస్తుల పరిశీలన..
మూడు దశల్లో ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెపుతున్నారు. ఎల్ 1 ఆఫీసర్లుగా ఇరిగేషన్ ,రెవెన్యూ శాఖల అధికారులతో పాటు కార్పొరేషన్ కుచెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యమై ఉన్నారు. ఎల్ 1 ఆఫీసర్లుగా ముగ్గురు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రెగ్యులరైజ్ చేయాల్సిన సంబంధిత ప్లాటు (ఇళ్లస్థలం) ఇరిగేషన్ శాఖ భూములు, రెవెన్యూ పరమైన భూమి పరిధిలోనిదా? కాదా ?? అనే సందేహ నివృత్తి కోసం సాంకేతికతను ఉపయోగించుకుని స్థానికులను విచారణ చేసి ఎల్ 2 ఆఫీసర్ గా ఏసీపీ పరిశీలనకు పంపుతున్నారు. అనంతరం ఎల్ 3 గా ఉన్న మున్సిపల్ కమిషనర్ పరిశీలనకు వెళుతోంది. అన్నీ సక్రమంగా ఉంటే ప్రాసెస్ స్పీడ్ గా జరుగుతోందని, ఏదైనా ఇబ్బందులుంటేనే ప్రాసెస్ స్లోగా జరుగుతోందని అధికారులు తెలుపుతున్నారు.
రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న క్లయింట్స్ కు సంబంధించిన స్థలాలు ఇరిగేషన్ భూముల్లో ఉన్నాయా? రెవెన్యూ ప్రభుత్వ భూముల్లో ఉన్నాయా అనే అంశాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు నిర్ధారించి సర్టిఫై చేశాకే ఎల్ 2 ఆఫీసర్ పరిశీలనకు వెళుతోంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తమ శాఖా పరమైన పనులతో బిజీగాఉండటంతో ఎల్ ఆర్ఎస్ ప్రక్రియ స్లోగా నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొద్ది నెలల క్రితం మంత్రి పొంగులేటి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్ ఆర్ఎస్ దరఖాస్తుల రెగ్యులరైజేషన్ పై స్పష్టంగా మాట్లాడి త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా ఇప్పటికీ నత్తనడకనే నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉన్న వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత ఛార్జీలను చెల్లించిన దరఖాస్తులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు కార్పొరేషన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.






